Breaking News

బాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ఏపీకి నీటిగండం

Published on Mon, 01/05/2026 - 04:56

సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా... సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు.

చంద్రబాబు తప్పునకు నిష్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్రబాబే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ స్కీమ్‌ నిలిపివేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటిగండమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో బాబు విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు.  

రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి 
‘రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు తొలి నుంచీ వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, లా యూనివర్సిటీ, హైకోర్టులను అమరావతికి తరలించుకుపోయారు. సీమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంత నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. వైఎస్‌ జగన్‌ ఏపీ ప్రయోజనాల కోసం తాపత్రయపడి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనతో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుదల చేయించినట్టు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన మాటలపై నిజనిర్ధారణకు అన్ని పార్టీల నుంచి నాయకులను పంపిస్తానని కూడా సవాల్‌ చేశారు. చంద్రబాబు చేసిన ఈ ద్రోహంపై రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పునకు బాధ్యత వహించి రాయలసీమ ప్రాజెక్టును చంద్రబాబు తక్షణం పూర్తి చేయాలి. లేకుంటే వదిలే ప్రసక్తే లేదు’  గడికోట హెచ్చరించారు.  

బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపం  
‘చంద్రబాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. ఏపీకి బాబు సీఎం అయిన ప్రతిసారీ నీటి గండం తలెత్తుతోంది. పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. గతంలో కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు ఏపీ తరఫున వాదనలు వినిపించడంలోనూ బాబు విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. అందుకే బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.

ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాలకు మంచి జరగాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయకులు కూడా రాయలసీమ ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకనే కేంద్రంతో మాట్లాడి మళ్లీ గాడినపెట్టారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా పక్కనపెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచి్చన చంద్రబాబు, కొన్ని రోజులు హడావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించారు’ అని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)