Breaking News

వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్‌..

Published on Fri, 08/22/2025 - 11:33

సాక్షి, విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా విశాఖలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.

వివరాల ప్రకారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిల్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు సీపీఎం, సీపీఐ కార్పోరేటర్లు మద్దతు తెలిపారు. 

వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్‌..
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై జీవీఎంసీ కౌన్సిల్‌లో కీలక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ప్లాంట్‌లో  44 విభాగాల ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుము కేటాయించాలి. ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనీ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను కౌన్సిల్‌ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)