Breaking News

షాపులో నక్కిన దొంగ ఓటర్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న చెవిరెడ్డి

Published on Thu, 11/05/2026 - 12:44

సాక్షి, చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయినగర్‌ పంచాయతీతో పాటు మంగళం, ఓటేరు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ జరుగుతున్నాయంటూ వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఈ క్రమంలో కొందరు దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పట్టుకున్నారు. దీంతో, టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు మండిపడ్డారు.

సాయినగర్‌ వద్ద భారీగా వ్యక్తుల మోహరింపు
చంద్రగిరి సాయినగర్‌ పంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల సమీపంలో పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు మోహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దొంగ ఓట్లు వేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారిని రప్పించాయని వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలిసింది. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.

దొంగ ఓటర్లను తరిమికొట్టిన చెవిరెడ్డి..
ఈ క్రమంలో సాయినగర్‌ పంచాయతీ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ గదిలో ఉన్న దొంగ ఓటర్లను పట్టుకున్నారు. దీంతో, వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించారు.

మంగళం, ఓటేరు బూత్‌ల వద్ద రిగ్గింగ్‌ ఆరోపణలు
మరోవైపు మంగళం, ఓటేరు పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతున్నాయని, ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు పోలింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

 ఇదిలా ఉండగా.. చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వివాదాలు కొనసాగుతుండగా, పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ జనరల్‌ ఏజెంట్‌ అశోక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ జనరల్‌ ఏజెంట్‌ అశోక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో ఏజెంట్ల విధులకు ఆటంకం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)