Breaking News

పోసాని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ

Published on Wed, 03/12/2025 - 12:40

అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ  ఈ పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్‌ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం. 

పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్‌ చేసింది.  ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా.. 

ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది.  ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్‌ పొందింది. ఈ ఉదయం కర్నూల్‌ జిల్లా జైలుకు పీటీ వారెంట్‌తో చేరుకుంది.  ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్‌సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్‌ను సవాల్‌ చేసింది. 

పోసాని జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)