Breaking News

ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరులో ఉద్రిక్తత..

Published on Mon, 04/24/2023 - 11:11

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ నేతల సవాళ్లకు ధీటుగా వైఎస్సార్‌సీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

అయితే, తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్‌కు ధీటుగా వైఎస్సార్‌సీపీ కౌంటర్‌ ఇచ్చింది. దీంతో, బోసుబొమ్మ సెంటర​్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. 

తాడేపల్లి: తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘రూ.14వందల కోట్లతో చేసిన అభివృద్ధి వారికి కనపడదు. డయాలసిస్ సెంటర్లు నిర్మిస్తున్నాం. సీఎం సభకు వచ్చిన జనాన్ని చూశాక టీడీపీ పని అయిపోయిందని వారికి అర్థం అయింది. 

అందుకే మాపై సవాల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ఎంపి కేశినేని నాని ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ టీడీపీ లేదని ఆయనకి బాగా అర్థం అయింది. ఇవ్వాళ మా సెకండ్ క్యాడర్ వస్తేనే బోస్ సెంటర్ కిటకిటలాడింది. ఇక నేను కూడా వెళ్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. మాపై ప్రజలకు ఉన్న ప్రేమ అలాంటిది. పోలీసులు వారి పని వారు చేసుకుపోతారు. నేను నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటాను. మేము చేసిన అభివృద్ధి సాక్ష్యాధారాలతో సహా చూపించటానికి ఎప్పుడైనా సిద్దమే అని పేర్కొన్నారాయన.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)