నా చావుకు ఎమ్మెల్యే పరిటాల అనుచరుడే కారణం

Published on Tue, 07/21/2026 - 04:42

రాప్తాడు రూరల్‌: రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడైన గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్‌ ఆలమూరు సూరి ఒత్తిడి మేరకు పోలీసులు తనపై దొంగతనం కేసు బనాయించారని, తన చావుకు గోనుగుంట్ల సూర్యనారాయణే కారణ­మని పేర్కొంటూ అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరులో సో­మ­వారం పురుగు­మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంకే నరేంద్ర బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు.

ఆత్మహత్యాయత్నానికి ముందు నరేంద్ర తన అరటితోటలో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.  దానిలో టీడీపీ నేతలు తనను ఎలా వేధించిందీ చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. తాను వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని తెలిపాడు. ఎమ్మెల్యే అనుచరుడు, గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యనారాయణ అలియాస్‌ ఆలమూరు సూరి ఆ పారీ్టకి అనుకూలంగా దొంగ ఓట్లు ఎక్కిస్తుండటంతో అడ్డుకున్నానని, అప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్నారని చెప్పాడు. ఆ క్రమంలోనే అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై దొంగతనం కేసు నమోదు చేయించారని తెలిపాడు.  

కాంట్రాక్టర్‌ సూచన మేరకే... 
ఆలమూరు జగనన్న కాలనీకి చెందిన కాంట్రాక్టర్‌ రమణారెడ్డి సూచనల మేరకు కాలనీలోని మోటా­రుకు రిపేరు చేయించి టెస్టింగ్‌ కోసం తన పొలంలో దించినట్లు చెప్పాడు. హౌసింగ్‌ ఏఈ సంపత్‌కుమార్‌తో ఫిర్యాదు ఇప్పించి.. తాను మోటారు దొంగిలించినట్లు అక్రమంగా కేసు బనాయించారని వాపోయాడు. గౌరవంగా జీవిస్తున్న కుటుంబానికి చెందిన తనకు పోలీసులు ముసుగువేసి, ఫొటోలు తీసి మీడియాలో ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నాన­ని చెప్పాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకంగా వ్యవహరిస్తున్న సూర్యనారాయణ తన ఇంటి ప్రహరీని కూడా కూలి్చవేయించాడని తెలిపాడు.

తన పరువును బజారుకీడ్చి నానా రకాలుగా అవమానించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పే­ర్కొన్న అనంతరం నరేంద్ర తన అరటితోటలోనే పురు­గుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న నరేంద్రను కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విష­మంగా ఉండడంతో  మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. బెంగళూరులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దగ్గరుండి ఆస్పత్రిలో చేరి్పంచి, మెరుగైన చికిత్స అందించేలా వైద్యులతో మాట్లాడారు.  

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)