Breaking News

‘టీటీడీలో గత పదేళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి’

Published on Thu, 11/27/2025 - 11:38

న్యూఢిల్లీ:   తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకని మాట్లాడితే మంచిదన్నారు. లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్‌ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈరోజు(గురువారం, నవంబర్‌ 27వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు.

 ప్రసాదం టెస్టింగ్‌ విసయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు. తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, టీటీడీలో 15 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని కూడా నిషేధించామన్నారు. ఈవో, చంద్రబాబులు తిరుమల లడ్డూ వివాదంపై పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని, దానిపై ఇప్పటివరక​ఊ సిట్‌ క్లారిటీ ఇవ్వలేదన్నారు. 

తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎవరి మీద బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. 2019-2024 వరకూ తయారైనా లడ్డూలన్నీ కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి.. కోట్లాడి మంది భక్తుల మనోభవాలను దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. 

గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి
టీటీడీలో గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘ 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి.  2024 ఆగస్టులో బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు..దానిపై సమాధానం చెప్పాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు. నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం. సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను ఏ అవినీతికి పాల్పడలేదు. అలాగే, ఎస్ బ్యాంక్ లో టీటీడీ డబ్బు డిపాజిట్లు, శ్రీనివాస సేతు వ్యవహారంపై దర్యాప్తు చేయాలి. అప్పన్న నా పిఎ కాదు. ఆయనకు నాకు సంబంధం లేదు. అప్పన్న ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేశారు’ అని తెలిపారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)