Breaking News

ప్రశ్నించే నాయకుల గొంతునొక్కాలన్న కుట్ర!

Published on Thu, 07/23/2026 - 05:28

‘‘అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.’’ 

‘‘ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేమిటి?  చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా?’’ 

‘‘చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో  రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే?’’  

సాక్షి, అమరావతి: ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరెస్టులతో తమ పార్టీని భయపెట్టలేరని,  ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించిందే ఆ తర్వాత కేసులా మారిపోతోందని, రాష్ట్రంలో నడుస్తున్న కొత్త చట్టవ్యవస్థ ఇదేనని జగన్‌ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి  సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ నేపధ్యంలో బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా జగన్‌ స్పందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

అరెస్టుల వెనుక కుట్ర 
‘‘అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. 

సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి?  చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో  రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? 

టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. 

నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం 
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది?  పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా?   

అరెస్టులతో భయపెట్టలేరు  
అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.  చంద్రబాబూ..అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం..వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.’’ అని జగన్‌ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?