స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Breaking News
మీవల్లే మేం క్షేమం..
Published on Tue, 09/03/2024 - 05:36
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయి ఉంటే తమ జీవితాలు పూర్తిగా అతలాకుతలమయ్యేవని విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు మాజీ సీఎం వైఎస్కు చెప్పుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించేందుకు అక్కడ ఆగారు.
దీంతో కృష్ణలంక, రాణిగారితోట, వారధి ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని వైఎస్ జగన్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీరు చేసిన మంచి పనుల కారణంగా మీం ఈరోజు క్షేమంగా ఉన్నామని, మాకు వరద ప్రమాదం తప్పిందని.. లేదంటే సింగ్నగర్ ప్రజల్లా తమ జీవితాలు అతలాకుతలం అయ్యేవని చెప్పారు. ఈ సందర్భంగా వారంతా జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో అండగా ఉంటాయని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
Tags : 1