Breaking News

YS Jagan: తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి నేటికి రెండేళ్లు

Published on Mon, 09/15/2025 - 15:49

తాడేపల్లి :  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి నేటికి రెండేళ్లు పూర్తవుతుంది. 2023లో విజయనగరంలో మెడికల్‌ కాలేజీని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.  అక్కడ నుంచే వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూర, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను కూడా వైఎస్‌ జగన్‌ ఆరంభించారు. 

ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి రెండేళ్లు అవ్వడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు  కార్యాలయ ఇంచార్జ్‌ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని, జక్కంపూడి రాజా, పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలు హాజరయ్యారు.  

చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు
దీనిలో భాగంగా మాజీ మంత్రి  విడదల రజిని మాట్లాడుతూ.. చరిత్రను చెరిపేస్తే చెరిగిపోదన్నారు. ‘రెండేళ్ల క్రితమే ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు చిరునామా. అందుకే‌ వైఎస్‌ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఒక్కో కాలేజీకి‌ సుమారు రూ.500 కోట్లు వ్యయం చేశాం. చంద్రబాబు  ప్రజల ఆరోగ్యంపై కక్ష కట్టారు. వారికి అందాల్సిన మెరుగైన వైద్యం, వైద్య విద్యను అందుబాటులోకి రాకుండా చేస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రయివేటు వారికి అమ్మేయాలని చూస్తున్నారు. మేము అధికారం లోకి రాగానే ఆ ప్రయివేటీకరణను రద్దు చేస్తాం. ఈలోపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం’ అని హెచ్చరించారు.

కాగా, ఏపీలో మెడికల్‌ కాలేజీలు అమ్మకానికి చంద్రబాబు కేబినెట్‌ ఇటీవల  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  రాష్ట్రంలోని పలు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.. 10 మెడికల్ కాలేజీలను పీపీపీలో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.

గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, కళాశాలల ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

 2023లో విజయనగరం మెడికల్‌  కాలేజీని వైఎస్‌ జగన్‌  ప్రారంభిస్తున్న దృశ్యం

వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.. 


నాటి శంకుస్థాపన శిలాఫలకం

 

5 మెడికల్ కాలేజీలకు 2 ఏళ్లు పూర్తి YSRCP నేతల కేక్ కట్టింగ్ సంబరాలు

నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్‌ కాలేజీల్లో 2023–24లో ప్రారంభం కాగా, గతేడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమైంది. గత వైఎస్ జగన్ సర్కారు రూ. 8,450 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టగా, అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు విద్యను ఎలా దూరం చేస్తున్నారనడాకి నిదర్శనంగా నిలుస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)