ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్
Breaking News
నేడు పులివెందులకు వైఎస్ జగన్
Published on Tue, 02/24/2026 - 02:14
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం పైన పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

Tags : 1