Breaking News

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం: వైఎస్‌ జగన్‌

Published on Sun, 07/27/2025 - 05:36

సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడ్డారు.

ప్రతి మంగళవారాన్ని అప్పులవారంగా మార్చుకున్న చంద్రబాబు.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.61 శాతం అధికంగా అప్పులు చేశారంటూ దెప్పి పొడిచారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచీ (ఇండికేటర్‌)లను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి
⇒  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, ఒక సవాలుగా నిల్చింది. సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. ఆ దిశగా వ్యయం చేస్తుందో, అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.

⇒   కానీ.. కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోంది. మరో వైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.
⇒  రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే.. మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 
కోల్పోతోందనడానికి నిదర్శనం.

⇒  గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగ్‌ విడుదల చేసిన నివేదిక చూపుతోంది.

⇒  గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 3.47 శాతం, ఇతర ఆదాయాలు, 
కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14 శాతం వృద్ధి మాత్రమే ఉంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)