300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
రేపు పులివెందులకు వైఎస్ జగన్
Published on Mon, 04/20/2026 - 08:26
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
తన పర్యటనలో బాగంగా వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.
స్థానిక వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి ఇటీవలె మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.
Tags : 1