Breaking News

రేపు పులివెందులకు వైఎస్‌ జగన్‌

Published on Mon, 11/24/2025 - 13:11

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జగన్‌ బెంగళూరులోని తన నివాసం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి పులివెందుల చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. సుమారు మూడు గంటల పాటు క్యాంపు కార్యాలయంలో పలువురి కలవనున్నారు. ఆ తరువాత స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటారు.

బుధవారం ఉదయం పులివెందులలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి హాజరై వధూ వరులను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత బ్రాహ్మణ పల్లె ప్రాంతంలో దెబ్బతిన్న అరటితోటలను సందర్శిస్తారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. అరటి రైతుల పరామార్శ తరువాత వై.ఎస్‌.జగన్‌ లింగాల మాజీ సర్పంచ్‌ మహేశ్‌ రెడ్డి కుటుంబాన్ని పులివెందుల్లోని వారి స్వగృహంలో కలుసుకుంటారు. ఇటీవలే మరణించిన మహేశ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామార్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రెండు గంటల పాటు అక్కడే ఉంటారు. అనంతరం వేల్పుల గ్రామంలోని రామలింగా రెడ్డి ఇంటివెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు భాకరాపురంలోని క్యాంపు ఆఫీసుకు ఆ తరువాత ఏడు గంటలకు స్వగృహానికి చేరుకుంటారు. రాత్రి బస చేస్తారు.

Kadapa District: 3 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న YS జగన్

గురువారం ఎనిమిది గంటలకు భాకరాపురం నుంచి హెలికాప్టర్‌ ద్వారా బెంగళూరులోని జక్కూరుకు ఆ తరువాత యలహంకలోని తన ఇంటికి వెళ్లడంతో ఈ పర్యటన పూర్తవుతుంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)