Breaking News

ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?: చంద్రబాబుపై వైఎస్ జగన్‌ ఫైర్

Published on Tue, 03/03/2026 - 23:20

సాక్షి, అమరావతి: అంగన్ వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు.  ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పేలా అవుతుందని నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని  నిలదీయడం నేరం అవుతుందా? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయమని ట్వీట్ చేశారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని వెఎస్ జగన్ మండిపడ్డారు.

ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?

వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు ఎగ్గొట్టి పచ్చి మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబూ.. మీరు తక్షణం అంగన్‌వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు.
 

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)