నిరసన తెలిపే హక్కును కాలరాస్తారా?

Published on Sat, 09/20/2025 - 04:49

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీ­కరిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకి­స్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుతంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వ­హించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ సీఎం చంద్ర­బాబును నిలదీశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరా­టా­లు మరింత ఉద్ధృతంగా కొ­న­సాగుతాయని స్పష్టం చేశా­రు. ఈ మేరకు శుక్ర­వారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..

» చంద్రబాబు గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆ­రోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్‌ కాలేజీల ప్రై­వేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్‌సీపీ యూ­త్, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతి­యుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డు­కోవాల­ను­కున్నారు? ఎందుకు లాఠీచార్జ్‌ చేశారు? గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరఫున ని­రసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా? 

» మీరు స్కాములు చేస్తూ ప్రజల ఆస్తులైన గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణ­చి వేస్తారా? మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరే­కి­స్తూ అసెంబ్లీ వెలుపల కూడా మా పార్టీ ఎమ్మెల్సీ­లు నిర­సిస్తుంటే పోలీసులతో దౌర్జన్యం చే­యించడం మీ బరితె­గింపు కాదా? ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం? 

»  మీరింతగా తెగబడినా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో­పాటు యువతీ యువకులు, స్టూడెంట్లు తెగింపు చూపా­రు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలో, ఇటు మెడికల్‌ కాలేజీల ఆవరణలో విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పేదల ఆరోగ్య భ­ద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మె­డికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించు­కునేంత వరకు పోరాటాలు ఉధృతంగా కొనసాగుతాయి. 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)