ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Published on Fri, 04/25/2025 - 15:31

సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్‌కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్‌. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్‌ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేసిన రంగన్‌.. అహ్మదాబాద్‌ ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్‌ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్‌ సైన్స్‌ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.

1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.

మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా  కమిటీకి కస్తూరి రంగన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్‌ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్‌ భార్య 1991లో కన్నుమూశారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)