Breaking News

హలో ఇండియా.. ఓసారి ఏపీ వైపు చూడండి

Published on Tue, 12/02/2025 - 02:50

సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ ‘‘సేవ్‌ ఫార్మర్స్‌’’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..

YS Jagan: హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్

‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్‌ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పని­చేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది.

⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకో­వడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలే­శారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరు­కుపోతుంటే మౌనరాగం ఆలపిస్తు­న్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)