నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
Published on Mon, 02/23/2026 - 11:38
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Tags : 1