Breaking News

సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published on Tue, 01/13/2026 - 11:38

సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్‌ చేశారు.

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు  దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది. 

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)