Breaking News

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం’

Published on Tue, 07/07/2026 - 12:03

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ భాకరాపురం క్యాంప్‌ కార్యా­లయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు భారీ ఎత్తున యువత తరలివచ్చారు. క్యాంప్‌ కార్యాలయం వద్ద బారులు తీరారు

.

ప్రజల నుంచి వైఎస్‌ జగన్‌ వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయులు
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్‌కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్‌ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని  హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘం నేతలు

కాగా, రేపు(జులై 8, బుధవారం) ఉద­యం వైఎస్‌ జగన్‌.. పులివెందుల నుంచి బయ­లు­దేరి ఉద­యం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)