టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Sun, 10/06/2024 - 19:16

సాక్షి, నరసారావుపేట: టీడీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్‌ జగన్‌. నాగరాజును జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.

కాగా, గత నెల 20న వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లనూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. దీంతో, నాగరాజును వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కొరకు నరసారావుపేట జీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు.. నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. నాగరాజును ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైఎస్‌ ఆకాక్షించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆదేశించారు.


 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)