Breaking News

ఇది మాఫియా సామ్రాజ్యం

Published on Sat, 10/19/2024 - 04:43

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం,  పేకాట క్లబ్‌ల మాఫియాలు  విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి.  ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలోదోచుకో పంచుకో తినుకో విధానంలో రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది.   – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా­రని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఎక్కడా మచ్చుకైనా డీబీటీ కానరావడం లేదని... కన్పిస్తుందల్లా డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు  అమలు చేయడం లేదని, సూపర్‌ సిక్స్‌ లేదు.. సెవెనూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పూర్తి స్థాయిలో బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఏకంగా ఇన్ని నెలలపాటు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌పై నడుస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ మరెక్కడా ఉండదన్నారు. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్‌.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెర లేపారని చెప్పారు. అప్పుడైనా.. ఇప్పుడైనా అవే డిస్టిలరీస్, లిక్కర్‌లో అవే స్పెసి­ఫికేషన్స్‌ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్‌ ఉంటే 14 కంపెనీలకు చంద్రబాబు హయాంలో అనుమ­తులు ఇచ్చారని, తాము అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

శుక్రవారం తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లా­డారు. రాష్ట్రంలో ఏ నియోజక­వర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమే­లుతున్నా­యని మండిపడ్డారు. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నా­యన్నారు. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందేనన్నారు. 

ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలో దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో మాఫియా పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలు.. ప్రభుత్వ అవినీతిపై ఎవరూ నిలదీయకుండా.. ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే లక్ష్యంతో తప్పుడు కేసులు బనాయి­స్తున్నారని.. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

» చంద్రబాబు మోడస్‌ ఆపరండా (ఓ పద్ధతి ప్రకారం అనుసరించే వ్యూహం) గమనిస్తే ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటాలా­డుతూ అబద్ధాలు చెబుతారు. వాళ్లకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్‌ ప్రచారం చేస్తారు. 

» ఆయన ఏ స్థాయిలో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారంటే..  పార్టీ నాయ­కులు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం అని మోసగించడంతో అది మొదలవుతుంది. మీకు రూ.పది వేలు రావాలంటే మా ప్రభుత్వం రావాలి.. మా ప్రభుత్వం రావాలంటే మేం చెప్పిన అబద్ధపు హామీలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి అని వలంటీర్లకు చెబుతారు.

» ఏ ఇంటికి వెళ్లినా సరే చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు! సంతోషమా..? అని అడుగుతారు. వాళ్ల అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు.. సంతోషమా?  అంటారు. చిన్నమ్మలు తారసపడితే నీకు రూ.18 వేలు.. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు... ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు రూ.36 వేలు... కండువా వేసుకొని రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అని అడుగుతారు. ఎవరినైనా సరే ఇదే మాదిరిగా మాటలు చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడమే మోడస్‌ ఆపరండాగా మార్చుకున్నారు.

» తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం క్లిçష్ట పరిస్థితుల్లో ఉంది. చేయాలన్నా నేను చేయలేకపోతున్నా..! అంటూ కొత్త మోడస్‌ ఆపరండా తెరపైకి తెస్తారు. అంతటితో ఆగిపోతుందా.. అంటే ఆగిపోదు. ఎన్నికల హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తారేమో? ఎవరైనా నిలదీస్తారేమో? అనే భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయాలని ఆరాట పడుతున్నారు. 

వీటికి తోడు మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో స్కామ్‌లకు తెర తీస్తున్నారు. వీళ్ల మోడస్‌ ఆపరండా ఏమిటో ఈ ఐదు నెలలుగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా పాలనే నిదర్శనం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)