Breaking News

నేడు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన

Published on Wed, 08/05/2026 - 05:56

ఆంధ్రప్రదేశ్‌, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.

ముఖ్యంగా పొగాకు ధరలు, వేలం ప్రక్రియ ఎలా జరుగుతోందనే అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో  పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత నెల 22న వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించిన రైతులు, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు.

రైతుల విజ్ఞప్తి మేరకు ఈరోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు.

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)