Breaking News

జగమంతా సంబరం

Published on Mon, 12/22/2025 - 04:39

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇచ్ఛా­పురం నుంచి హిందూపురం వరకు ప్రతి గ్రామంలోనూ పండుగను తలపించేలా వేడుకలు జరుపుకొన్నారు. కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజక­వర్గాల్లోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్ర­మాలు చేపట్టారు. పార్టీ జిల్లా, నియోజక­వర్గ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రక్త­దాన శిబిరాలకు అనూహ్య స్పందన వ­చ్చింది. 

యువత, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసి వైఎస్‌ జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నా­రు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పేద­లు, అనాథలకు దుస్తులు పంపిణీ చేశా­రు. వికలాంగులకు ట్రై సైకి­ళ్లు అందజేశా­రు. ఆస్పత్రుల్లో రోగు­లకు పండ్లు, ఆహా­రం, కేక్‌లు పంచిపెట్టారు. 

మరోవైపు ప­లు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ని­ర్వ­హించి పేదలకు అవసర­మైన పరీక్షలు చేసి మందులు అందించారు. నేత్ర వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. విద్యా­ర్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. యువతకు షటిల్, క్రికెట్‌ పోటీలు, రైతు­లకు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు.. పెద్ద ఎత్తున ర్యాలీలు..
వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరిపించారు. వైఎస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని, 2029లో మళ్లీ సీఎం కావాలని వేడుకున్నారు. అదేవిధంగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్‌ జగన్‌ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. 

ము­ఖ్యంగా పలు ప్రాంతాల్లో యువత భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ‘జై జగనన్న.. రావాలి జగనన్న.. కావాలి జగనన్న..’ అని నినదించారు. గ్రామాల్లో జరిగిన వేడుకల్లో రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్‌ జగన్‌ పాలనలో తమకు కలిగిన లబ్ధి గురించి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు పాల­నలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టారు.  

ఇతర రాష్ట్రాలు.. దేశాల్లోనూ..
జగన్‌ జన్మదిన వేడుకలను దేశ రాజ­ధాని న్యూఢిల్లీతో పాటు తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా  రాష్ట్రాల్లోనూ అభిమా­­నులు ఘనంగా నిర్వ­హించారు. అమెరికా, లండ­న్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, కువైట్, ఖతార్‌ సహా పలు దేశాల్లోనూ వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా జరుపుకొన్నారు. గుజరాత్‌లోని మార్వా­డి యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువు­తున్న తెలుగు విద్యార్థులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. 

సామాజిక మాధ్యమాల్లో జగనిజం 
వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు శుభాకాంక్షల పోస్టులతో సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ఆదివారం ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం నుంచే సోషల్‌ మీడియాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్‌ జగన్‌’ అంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర మాధ్యమాల్లో వెల్లువెత్తిన పోస్టులు ట్రెండింగ్‌లో నిలిచాయి. అధిక వ్యూస్‌ సంపాదించాయి. ‘ఎక్స్‌’లో అయితే ‘హ్యాపీ బర్త్‌ డే వైఎస్‌ జగన్‌ హ్యాష్‌ట్యాగ్‌’ టాప్‌ ట్రెండింగ్‌గా నిలిచింది.

మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా: వైఎస్‌ జగన్‌
తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన అందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు, వైఎస్సార్‌సీపీ కటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అందరి మద్దతే నాకు గొప్ప బలం’ అని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)