Breaking News

బటన్‌ నొక్కితే కమీషన్లు రావు

Published on Fri, 02/07/2025 - 05:45

సాక్షి, అమరావతి: ‘ఎలాంటి లంచాలకు తావు లేకుండా బటన్‌ నొక్కి రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేసింది గత ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేక­పోతు­న్నాడు? ఎందుకు బటన్‌ నొక్కలేక పోతు­న్నాడు? బటన్‌ నొక్కితే ఏమీ రాదు కాబట్టి.. కమీషన్లు అందవు కాబట్టి.. అందుకే ఆయన బటన్‌ నొక్కలేకపో­తున్నాడు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురు­వారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగినా, అక్రమాలు జరిగినట్లు సృష్టించి.. దానితో ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

‘మా ప్రభుత్వ హయాంలో వాల్యూమ్స్‌ తగ్గాయి.. రేట్లు షాక్‌ కొట్టేలా ట్యాక్స్‌లు పెంచాం. ఇందుకు కమీషన్లు ఇస్తారా? లేక వాల్యూమ్స్‌ పెంచి, రేట్లు పెంచారు కాబట్టి చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారా? చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారని ఈనాడు రాస్తుందా?’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

లేనిది ఉన్నట్టుగా చెబితే పెట్టుబడులు వస్తాయా?
పెట్టుబడులు రావాలంటే.. రాష్ట్రం కోసం గొప్పగా చెప్పడం మొదలు పెట్టాలి. నువ్వంతట నువ్వే రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా, నెగిటివ్‌గా చెప్పడం మొదలు పెడితే ఏ విధంగా కాన్ఫిడెన్స్‌ ఇస్తావ్‌? దావోస్‌ నుంచి నీతి ఆయోగ్‌ దాకా చంద్రబాబు స్టేట్‌మెంట్లు చూడండి. రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా దుష్ఫ్రచారం చేస్తు­న్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు? 

జిందాల్‌ వంటి సంస్థలు వస్తుంటే వాళ్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి పంపించేశాడు. వాళ్లు పది మందికి చెప్పరా? జిందాల్‌ లాంటి వాళ్లకే ఈ పరిస్థితి ఉంటే.. మిగిలిన వాళ్లెందుకు వస్తారు? ఇలాంటప్పుడు ఏ పరిశ్రమైనా ఎందుకు వస్తుంది? అసెంబ్లీ సమావేశాలు మేం ఎందుకు బహిష్కరిస్తున్నా­మనే దానికి స్పీకర్‌ను అడిగితే బాగుంటుంది. అందుకే మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తున్నాం. 

సూపర్‌ సిక్స్‌లు లేవు.. సూపర్‌ సెవన్‌లు లేవు.. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. వైఎస్సార్‌సీపీ–2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలుగుతాను. రాజకీయాల్లో ఉన్న­ప్పుడు విశ్వసనీయత, వ్యక్తిత్వం ప్రధానం. కష్టకాలం ఎల్లకాలం ఉండదు. ఓపిక ఉండాలి. జిల్లాల పర్యటనకు ఇంకా సమయం ఉంది.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)