Breaking News

చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్‌

Published on Tue, 02/10/2026 - 16:20

సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు.  చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. 

రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్‌డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.

2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి

22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ

23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ  పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ ‌ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ  ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు