అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Published on Tue, 02/24/2026 - 23:20
సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.
ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Tags : 1