Breaking News

సింధనూరు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్ఫ్రాంతి

Published on Wed, 01/22/2025 - 13:15

గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్‌చూర్‌ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. 

కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. 

మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్‌ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు