Breaking News

‘లద్దాఖ్‌’లో జవాన్ల మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Published on Mon, 07/01/2024 - 17:08

సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్‌ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. 

వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌ కు చెందిన సుభాన్‌ ఖాన్‌ల కుటుంబాలకు నా సంతాపం. 

రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి  కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం  చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్‌ జగన్‌ కోరారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)