Breaking News

ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published on Wed, 10/08/2025 - 11:44

సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. 

పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.

నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance)   ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి YS జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు

ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)