Breaking News

నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం

Published on Wed, 06/11/2025 - 16:27

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు  పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.

మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు.

నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం

..కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)