Breaking News

ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి..

Published on Mon, 07/06/2026 - 05:36

సాక్షి, అమరావతి: ‘ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా. మమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు. మాకు అర్థం కావడం లేదు. మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన తప్పుగా మాట్లాడారని కేసుల మీద కేసులు పెడుతున్నారు. వాటిన్నిటికీ ఆయన బెయిల్‌ తెచ్చుకుంటున్నారు. మళ్లీ కేసులు వేస్తున్నారు. మళ్లీ బెయిల్‌ తెచ్చుకుంటున్నారు. ఎందుకండీ ఇంతలా వేధిస్తున్నారు. అవసరమా మీకు. ఒక మనిషి మాట్లాడితే తప్పు కాదు. 

ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు.. ఇవే కేసులు పవన్‌కళ్యాణ్‌ మీద కూడా వేయాలి కదా. ఆయన మాట్లాడిందే.. నా భర్త రావణ్‌ మాట్లాడారు’ అని ప్రశ్న యూట్యూబర్‌ రావణ్‌ భార్య బచ్చలకూర అనూష ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్‌ వీడియోలు, తప్పుడు కేసులతో చంద్రబాబు ప్రభుత్వ వేధింపుల వల్ల తమ కుటుంబం అనుభవిస్తున్న క్షోభను ఆదివారం ఓ వీడియో ద్వారా అనూష వెల్లడించారు.  

ఒకేసారి చంపేయండి 
‘మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. రోజుకో కేసు పెట్టి వేధించకండి. నాకు ఉన్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతోంది. వాళ్ల నాన్న కావాలని అడుగుతోంది. తన మొహం అయినా చూడండి. లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అంటున్నారు. మీరు కేసులు పెట్టడం లేదు. మమ్మల్ని హింస పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి సార్‌. లేదా.. ఒకేసారి చంపేయండి. అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోవచ్చు. మిమ్నల్ని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు అయితే ఆయనతో పాటు నన్ను, నా కూతుర్ని చంపేయండి. ఇంతకుమించి మేం ఏమీ చెప్పలేం. మార్ఫింగ్‌ వీడియోలు పెట్టడం చాలా తప్పు. అలాంటి వీడియోలు ఎక్కడైనా ఉంటాయా. మీరు చేసింది చాలా తప్పు’ అని అనూష కన్నీటి పర్యంతమయ్యారు. 

అది కల్పిత వీడియో 
తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మార్ఫింగ్‌ (కల్పిత) వీడియో సృష్టించి తన భర్త రావణ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనూష లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘రావణ్‌ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు, మతాలు పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. నా భర్తది కమ్మ కులం. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్‌ పలానా పార్టీ.. పలానా వర్గం అని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. 

మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్‌ లక్ష్యం. వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో జరిగిన దారుణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రావణ్‌ను వేధిస్తున్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పదు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలి’ అని అనూష కోరారు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)