Breaking News

యువతకు బాసటగా మరో పోరాటం

Published on Mon, 06/23/2025 - 03:40

సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌­సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్ను­పోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యువ­తకు బాసటగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్‌­సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు.   

కృతి లేదు.. భృతి లేదు 
2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ ని­రు­ద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది.  

అమలు చేసేశామంటూ అబద్ధాలు 
నిరుద్యోగ భృతిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యా­ఖ్యానించారు. మరో­వైపు కాలేజీలకే ఫీజు రీయిం­బర్స్‌­మెంట్‌ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా­రు.

తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధి­క వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.­4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.  

ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. 
ఏటా జ్యాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మందిని వలంటీర్ల ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంటివద్దకే రేషన్‌ బియ్యం, సరుకులు పంపిణీ చేసే ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడం ద్వారా వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు వంటి 20 వేల మందిని రోడ్డున పడేశారు. బెవరేజస్‌ కార్పొరేషన్‌లో పనిచేసే 15 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులనూ తొలగించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను భారీ ఎత్తున తొలగించారు. ఏడాదిలోనే సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు.   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)