Breaking News

బాలుడిపై యువకుల పాశవిక దాడి

Published on Wed, 08/07/2024 - 06:14

చుండూరు (కొల్లూరు): కొందరు యువకులు మద్యం మత్తులో ఓ బాలుడిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొడుతూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు... బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన బాలుడు(17) ఒంగోలు వెళ్లి తన పెదనాన్న వద్ద ఉంటూ కుట్టుపని నేర్చుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల కిందట గ్రామానికి వచ్చి అనారోగ్యం వల్ల ఒంగోలు వెళ్లలేదు.

గత నెల 31న ఆ బాలుడి వద్దకు తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు సూర్య, మరో యువకుడు బైక్‌పై వచ్చి సరదాగా బయటకు వెళదామని చెప్పి మండూరు చర్చి డొంక రోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు యువకులు మద్యం తాగి ఆ బాలుడిని కూ­డా బీరు తాగాలని ఒత్తిడి చేశారు. అందరూ మద్యం తాగుతుండగా, చినగాదెలవర్రుకు చెందిన దయా, ఆలపాడుకు చెందిన చిన్ను అనే వ్యక్తులు వచ్చి వారితో కలిశారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా యువకులందరూ కలిసి ఆ బాలుడిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులు, కర్రలు, బెల్టులతో పైశాచికంగా కొడుతూ అతని చొక్కా చింపేశారు. సుమారు రెండు గంటలు దాడి చేస్తూ వీడియోలు తీశారు. 

ప్రమాదమని చెప్పి ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం.. 
తీవ్రంగా గాయపడిన బాలుడిని ఇద్దరు యువకులు ఆటోలో తెనాలి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరి్పంచేందుకు ప్రయతి్నంచారు. అయి­తే, ఇది ప్రమాదం కాదని, కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఆ యువకులు బయటకు తీసుకురాగా, బాలుడికి తెలిసిన వ్యక్తి చూసి ఏమైందని ప్రశి్నంచడంతో యువకులు పారిపోయారు. అతను బాధిత బాలుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు చుండూరు ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ ఈ నెల ఒకటో తేదీన కూచిపూడి, తెనాలి, పరిమి, గాదెలవర్రు, ఆలపాడుకు చెందిన ఏడుగురు యువకుల­ను అదుపులోకి తీసుకుని వారిపై 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన యువకు­లు అధికార పారీ్టకి చెందినవారు కావడంతో రాజీ చే­యాలని వేమూరుకు చెందిన ముఖ్య నేత, పార్లమెంట్‌ స్థాయి నేత ఒకరు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడినవారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేంత చిన్న కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బైక్‌ల చోరీ కేసులలో పట్టించానని కొట్టారు  
జూలై 31వ తేదీన నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే చినపరిమి గ్రామానికే చెందిన నా స్నేహితుడు సూర్య బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. మండూరు గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి బీరు తాగించి కొట్టడం ప్రారంభించారు. సూర్యతోపాటు చినగాదెలవర్రుకు చెందిన యువకుడు దయ, మరో ఐదుగురు ఉన్నారు. తెనాలిలో నన్ను కాల్వలో పడేద్దామని తీసుకెళుతుంటే మా ఊరి వ్యక్తి కనిపించాడు. ఆయన సాయంతో వైద్యశాలలో చేరాను. గతంలో బైక్‌ల చోరీ విషయంలో దయా అనే వ్యక్తిని పోలీసులకు పట్టించానన్న కక్షతో నన్ను కొట్టారు.   – బాధిత బాలుడు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)