Breaking News

Hyderabad: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య

Published on Tue, 06/25/2024 - 13:30

వెంగళరావునగర్‌: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు నామవరపు జ్యోత్స్న శ్రీ (17) భద్రాచలంలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది. అనంతరం ఆమెను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తూ తల్లి రజిని భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసుకున్న జ్యోత్స్నశ్రీ తనకు ఇంగ్లిష్‌ పాఠాలు అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వచి్చంది. 

భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్నశ్రీ తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. నాలుగురోజులుగా ఆ యువతి అమీర్‌పేటలోని ఓ షోరూంలో పని చేస్తుంది. ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో షాపు ఓనర్‌ నాగమణి యువతి తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్లింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్‌ చేసి అటు చదువుకోకపోగా పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ మందలించింది.

 దాంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేకని సమయంలో ఆ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచి్చన స్వరూప తలుపు గడియకూడా పెట్టకుండా ఉండటంతో లోపలకు వెళ్లింది. స్వరూపకు జ్యోత్న్స ఉరేసుకుని ఉండటం చూసి 108కి ఫోన్‌ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి పిన్ని మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)