యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని..

Published on Sun, 02/02/2025 - 12:22

అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం): యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి బంధువులు ఆ యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. తమ కుమారుడిని ఆ యువతి బంధువులు కొట్టి హత్య చేశారని బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన శనివారం గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాక సీఐ ఎ.పార్థసారథి తెలిపిన వివరాలివీ. విజయనగరం జిల్లాకు చెందిన జి.భాస్కరరావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

ఇంకా వివాహం కాలేదు. గాజువాక శ్రీనగర్‌లోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి యజమానురాలి మనవరాలు ఊరు నుంచి వచ్చింది. పై ఇంట్లో యజమానురాలి బాత్‌రూమ్‌ కొంత ఓపెన్‌గా ఉంటుంది. శనివారం మనవరాలు స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీస్తున్నాడని బిగ్గరగా అరిచింది. దీంతో భాస్కరరావు అక్కడ నుంచి తన రూమ్‌లోకి వచ్చేశాడు. అక్కడకి వచ్చిన యువతి బంధువులు భాస్కరరావుపై దాడి చేసి అతడి రూమ్‌లోనే బంధించి తాళం వేశారు.

 వీడియో విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన భాస్కరరావు తన రూమ్‌లోనే కేబుల్‌ వైర్లతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరంలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న భాస్కరరావు తండ్రి తాతారావు.. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)