Breaking News

క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టమన్నందుకు..

Published on Mon, 05/05/2025 - 13:07

మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్‌ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్‌(25) పట్టణంలోని ప్రైవేట్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. 

అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్‌ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. 

ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్‌ సిబ్బంది శ్రీకాంత్‌ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)