Breaking News

Fact Check: చదువులపై ‘చెత్త’ రాతలు

Published on Thu, 09/14/2023 - 04:24

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందించడాన్ని పచ్చ పత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అసత్య కథనాలతో పదే పదే విషం చిమ్ముతున్నాయి. స్కిల్‌ కుంభకోణంలో కోట్లాది రూపాయలు మాయం చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలు కావడంతో దిక్కుతోచని పచ్చ పత్రికలు మరోమారు బడుగుల చదువులపై పడ్డాయి.

చంద్రబాబు దోపిడీ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బుధవారం ఓ పచ్చపత్రిక బైజూస్‌కు లేని టెండర్‌ సీమెన్స్‌కు కావాలా? అంటూ అర్థంపర్థం లేని వార్తను ప్రచురించించి. ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని, కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

చంద్రబాబు ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీమెన్స్‌ సంస్థతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ముందస్తుగానే వందల కోట్లు చెల్లించేసింది. ఇందులోనే అసలు మతలబు తెలిసిసోతోంది. ఈ వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద పిల్లల అభ్యున్నతికి బైజూస్‌ కంటెంట్‌ అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. బైజూస్‌తో ఒప్పందం చేసుకొని మరీ ఆ సంస్థ కంటెంట్‌ను పిల్లలకు అందిస్తోంది.

పైగా, బైజూస్‌కు ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. వందల కోట్ల విలువైన కంటెంట్‌ను బైజూస్‌ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది. ఎటువంటి ఒప్పందం లేకుండా జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి.., పూర్తి పారదర్శకంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకొని, పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యా సేవకు లింకు పెట్టి పచ్చపత్రిక కథనాన్ని ఇవ్వడాన్ని విద్యా శాఖ ఖండించింది. అసలు వాస్తవాలను విద్యా శాఖ వెల్లడించింది. 

♦ బైజూస్‌ సంస్థతో చేసుకున్న ఎంవోయూ ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో 4 నుంచి 10వ తరగతి పిల్లలకు బైజూస్‌ కంటెంట్‌ యాప్‌ను వారి సొంత మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉచితంగా యాక్సెస్‌ చేయడానికి అందుబాటులో ఉంచారు. 
♦ దీనికోసం బైజూస్‌కి ప్రభుత్వం ఎటువంటి డబ్బు చెల్లించలేదు. 
♦ 8వ తరగతి చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు బహిరంగ, పారదర్శక బిడ్డింగ్‌ ద్వారా శామ్‌సంగ్‌ కంపెనీ నుండి ట్యాబ్‌లను  ప్రభుత్వం సేకరించింది.  
♦ దీనిలో బైజూస్‌ పాత్ర ఏమీ లేదు. ఈ శామ్‌సంగ్‌ ట్యాబ్‌ ఎస్డీ కార్డ్‌లో కంటెంట్‌ను లోడ్‌ చేసినందుకు బైజూస్‌కు శామ్‌సంగ్‌ సంస్థే లేబర్‌ ఛార్జీలను చెల్లించింది. 
♦ ఇది బైజూస్, శామ్‌సంగ్‌  హార్డ్‌వేర్‌ తయారీదారుల మధ్య అంతర్గత ఏర్పాటు. కాబట్టి ప్రభుత్వం, బైజూస్‌ మధ్య ఎటువంటి డబ్బుల ఒప్పందం లేదు.  
♦ బడి పిల్లలకు కోర్సుకు రూ. 15,000 చొప్పున 5.18 లక్షల మంది పిల్లలు కంటెంట్‌ని ఉచితంగా యాక్సెస్‌ చేస్తున్నారు. కాబట్టి దీని విలువ దాదాపు 750 కోట్లు ఉచితంగా అందజేసినట్లుగా భావించాలి. 
♦ అంతేకాకుండా 4 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు 17,59,786 మందికి రూ.12,000 విలువ చేసే కంటెంట్‌ విలువ మొత్తం రూ. 2,111.74 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా రాష్ట్ర విద్యార్థులకు  ఉచితంగా బైజూస్‌ అందించింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)