Breaking News

పిల్లల్ని లాగిపడేసి.. గుంటూరు జైలు వద్ద పోలీసుల హైడ్రామా

Published on Wed, 07/30/2025 - 11:50

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌పై పెట్టిన అన్ని అక్రమ కేసుల్లో కోర్టులు బెయిల్‌ మంజూరు చేశాయి. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అదీ కుటుంబ సభ్యులు చూస్తుండగానే బలవంతంగా ఆయన్ని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లారు. 

గుంటూరు జిల్లా జైలు వద్ద బుధవారం పోలీసుల హైడ్రామా నడిచింది. తురకా కిషోర్‌ రిలీజ్‌ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత విడుదల కాబోతుండడంతో వారంతా సంతోషంగా కనిపించారు. అయితే అది ఎంతో సేపు నిలవలేదు. 

జైలుకు వచ్చిన వెంటనే ఆయన తన కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. కూతుళ్లను అక్కున చేర్చుకున్నారు. అయితే ఇంతలో రెంటచింతల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంటి బిడ్డలను లాగేసి పడి.. కుటుంబ సభ్యులను నెట్టేసి మరీ..  కిషోర్‌ను బలవంతంగా జీపు ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పేది వినకుండా ఆయన్ని బలవంతంగా లాక్కెల్లారు. తోపులాటలో కిషోర్‌ కూతురు సహా కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. 

కిషోర్‌ది అక్రమ నిర్బంధమేనని ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. జైలు ఆవరణలో పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ విషయమైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెబుతున్నారు.

తురకా కిషోర్ పై మొత్తం 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీయాక్ట్‌ కేసు నమోదు చేశారు. ఈ పీడీ యాక్ట్‌ కేసుపై న్యాయ పోరాటం చేయగా.. కోర్టు కేసు కొట్టేసింది. అదే సమయంలో.. మిగతా కేసుల్లో తురకా కిషోర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)