Breaking News

విశాఖలో భూ దోపిడీ

Published on Mon, 12/01/2025 - 04:47

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని, ఓపెన్‌ ఆక్షన్‌ లేకుండానే నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు మాత్రం ఎకరం 99 పైసలు, రూ.100కే కట్టబెడుతూ భూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో గుడ్‌ గవర్నెన్స్‌ అర్థమే మార్చేశారని, ఏ కార్యాలయానికి వెళ్లినా లంచం లేకుండా పని జరగడం లేదన్నారు. ఈ అవినీతి వెనుక అధికార పార్టీ నేతల లావాదేవీలే కారణమన్నారు. ఆదివారం ఆయన విశాఖ లాసన్స్‌బే కాలనీలోని క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

భూ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా రెండు జీవోలు జారీ చేయడంపై స్పందిస్తూ.. రహస్యంగా ఒప్పందాలు చేసుకుని, కోట్ల విలువైన భూములను పప్పుబెల్లాల్లా కేటాయిస్తుండటం దారుణం అని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. గిరిజన బాలింత మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించిన పాపాన పోలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా గాలికొదిలేశారని.. పిల్లలు కలుషి త ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ ఘనత వైఎస్సార్‌సీపీదే 
భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్సార్‌సీపీదే అని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున మండలి విపక్ష నేతకు ఆహా్వనం లేకుండా చేసి, ఈ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని, సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలును మార్క్‌ ఫెడ్‌ ద్వారా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు.

‘ఉపాధి’ కూడా నీరుగారిపోయిందని చెప్పారు. భూసేకరణ పేరుతో అమరావతిలో జరుగుతున్న భూ దోపిడీ సహా అన్నీ త్వరలోనే ప్రజలకు అర్థమవుతాయని స్పష్టం చేశారు. భూ సేకరణపై అమరావతి రైతుల విధానమే తమ విధానం అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పడానికి కోటి సంతకాల కా­ర్యక్రమానికి వస్తున్న స్పందనే నిదర్శనం అన్నారు. సిరిమాను జాతర సందర్భంగా వేదిక కూలడం, తన భద్రతపై ప్రభుత్వం అలసత్వం వహించడంపై గవర్నర్‌కు లేఖ రాశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, కాకినాడ పార్లమెంట్‌ పరిశీలకులు సూర్యనారాయణ రాజు, వైఎస్సార్‌సీపీ నేత మూగి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)