Breaking News

‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!

Published on Fri, 12/13/2024 - 05:47

సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు ఇప్పటికే  శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. 

కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్‌క్లూజివ్‌ అండ్‌ సస్టెయినబుల్‌ క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’కి 788.8 మిలియన్‌ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్‌ యెన్‌లో అందించనున్నట్లు ప్రకటించారు. 

ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్స్‌) సహకారంతో ప్రోగ్రామ్‌కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్‌ మియో ఓకా తెలిపారు. 

ఇక  రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్‌ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)