Breaking News

టీడీపీ నేతను చితకబాదిన మహిళలు!

Published on Tue, 02/04/2025 - 04:10

తాడికొండ: తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారం రచ్చకెక్కడంతో మహిళలు ఆగ్రహించి ఓ టీడీపీ నేతను చితకబా­దిన వైనం తీవ్ర సంచలనం సృష్టించింది. వివరా­ల్లోకి వెళితే..  లాం గ్రామంలో ఎలాంటి అనుమ­తులు లేకుండా తెలుగు తమ్ముళ్లు అక్రమంగా మైనింగ్‌ చేసి గ్రావెల్‌ను జోరుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్‌ చేసే సమయంలో అక్కడ జనావాసాల మధ్య పెద్ద రాయి వచ్చి పడింది. దాన్ని తొలగించకుండా తెలుగు తమ్ముళ్లు వదిలేయడంతో టీడీపీకే చెందిన అహ్మద్‌ కుటుంబ సభ్యులు పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్‌ అఫ్జల్‌ను నిలదీశారు.

ఇలా అయితే తాము  ఉండేదెలా అంటూ ప్రశ్నించారు. స్థాని­కులు దీనికి వత్తాసు పలకడంతో వ్యవహారం ముదిరింది. అఫ్జల్‌ దుర్భాషలా­డడంతో స్థానిక మహి­ళలతోపాటు, తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. దాడిలో అఫ్జల్‌ చొక్కా చిరిగి­పోయింది. దీంతో ఆగ్రహించిన అఫ్జల్‌ వర్గీయులు ఎదురు­దాడికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తతత నెలకొంది.

కాగా,  గ్రామంలో రెండు నెలలుగా  అక్రమంగా మైనింగ్, బ్లాస్టింగ్‌ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండుసార్లు కలెక్టర్‌తోపాటు, మైనింగ్, విజిలెన్స్‌ అధికారులకు గ్రామస్తులు నేరుగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కనీసం తొంగి చూసిన దాఖలాలు లేవు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)