Breaking News

నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు

Published on Sat, 10/11/2025 - 05:51

కడప కార్పొరేషన్‌/ఏలూరు టౌన్‌: నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు కదం తొక్కారు. ఎన్‌–బ్రాండ్‌ లిక్కర్‌ను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ప్రకాష్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట మద్యం పారబోసి నిరసన తెలిపారు. అనంతరం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వినోద్‌ కుమార్‌ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ మాట్లాడుతూ ప్రజలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, నకిలీ మద్యం ఎక్కడపడితే అక్కడే దొరుకుతోందన్నారు. ఇప్పటికే నకిలీ మద్యానికి నలుగురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యులైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

ఏలూరులో..
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వీధివీధిలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మండిపడ్డారు. ఏలూరు న్యూ అశోక్‌నగర్‌లోని ఎక్సైజ్‌ శాఖ డీసీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్‌సీపీ మహిళా నేతలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి మద్యంతో అభిõÙకం చేసి నినాదాలు చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)