Breaking News

మద్యం దుకాణంపై మహిళాగ్రహం

Published on Sun, 05/04/2025 - 04:30

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే  మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లు ఇస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చాక వీధివీధికి బెల్టుషాపులు మాత్రం పెట్టిస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన మహిళలు మండిపడ్డారు. పోతేపల్లి గ్రామం జ్యూయలరీ పార్కు సమీపంలో నివాస గృహాల మధ్య ఏర్పాటుచేసిన శక్తి వైన్‌షాపును వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. వైన్‌షాపు ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపు వల్ల మందుబాబులు అల్లరి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త వ్యక్తులు వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 

పర్మిట్‌ రూంకు అనుమతి లేనప్పటికీ షాపు నిర్వాహకులు చుట్టూ పరదాలు కట్టి మరీ మందుబాబులతో వైన్‌షాపు వద్దే తాగిస్తున్నారంటూ ఆరోపించారు. గృహాల మధ్య వైన్‌షాపునకు అనుమతి ఇవ్వొద్దంటూ సాక్షాత్తూ ఎక్సైజ్‌శాఖ మంత్రికి పిటిషన్‌ పెట్టినా ఫలితం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో షాపును తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి పత్తా లేకుండా పోయారంటూ మండిపడ్డారు. హోంమంత్రి అనితను కలిసి సమస్య విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. కలెక్టర్‌ కూడా అదే ధోరణిలో వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వైన్‌షాపు వెంటనే తొలగించకుంటే ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో షాపు నిర్వాహకులు, పోతేపల్లి గ్రామస్తులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న బందరు రూరల్‌ పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరుపక్షాలతో చర్చలు జరిపారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో నిర్వాహకులు షాపునకు తాళం వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ధర్నాలో పోతేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు, అంజి, కిషోర్, అనిల్, నాగబాబు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)