Breaking News

విజయానికి చేయూత

Published on Sun, 05/14/2023 - 03:52

నర్సీపట్నంలో కిరాణా షాపు నడుపుకుంటున్నాం. మా ఇంట్లో నలుగురుంటారు. కుటుంబ పోషణకు ఈ దుకాణమే ఆధారం. గతంలో చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడేవాళ్లం. కరోనా సమయంలో వ్యాపారం చేయడానికే లేదు. బతుకు కష్టమే అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకుంది. గతంలో మాలాంటి వారికి ఎలాంటి సాయం ఉండేది కాదు. మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక నరకం చూశాం. ఈ ప్రభుత్వంలో పథకాలు వరంలా ఆదుకుంటున్నాయి. మెప్మా అందించిన రుణ సాయంతో పాటు, చేయూత డబ్బులతో దుకాణాన్ని విస్తరించుకున్నాం. ఇప్పుడు రోజుకు రూ.800 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది.   
 – కొల్లాన లక్ష్మి, నర్సీపట్నం 

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద బొడ్డేపల్లికి చెందిన బంగారు లక్ష్మికి భర్త లేడు. తన ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఎన్నో కష్టాలు పడింది. బతుకుదెరువు కోసం ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్ముకున్నా, పెద్దగా ఫలితం లేకపోయింది. జగనన్న ఇచ్చిన చేయూత పథకం సొమ్ము రూ.18,750కి తోడు కొంత పొదుపు రుణం తీసుకుని ఇంటి వద్దే కిరణా దుకాణం ప్రారంభించింది. మెప్మా ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తోంది. 


నర్సీపట్నంలో ఉంటున్న పెదపూడి అరుణకుమారి, లక్ష్మి తోడికోడళ్లు. వీరి భర్తలు ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వం వీరికి చేయూత, ఆసరా, రైతు భరోసా కింద ఇచ్చిన నగదును వర్క్‌షాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వీరికి బ్యాంకు రూ.5 లక్షలు రుణంగా మంజూరు చేసింది. పొదుపు నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్న వీరు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ‘మా పని రైతులతో ముడి పడింది. ఆర్డరు రాగానే డబ్బులు ఇవ్వరు.. ముందు పెట్టుబడి పెట్టాలి. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఉపయోగపడింది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం గతంలో ఎప్పుడూ అందలేదు’ అని తెలిపారు. ఇలా ఒక్క నర్సీపట్నంలోనే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు 10,071 మంది ఉంటే, వారిలో 4,067 మంది చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు.  

విశాఖ, నర్సీపట్నం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: అసలే పట్టణాలు.. ఆపై అదనపు ఖర్చులు.. ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ప్రతి ఖర్చుకు ఓ లెక్క.. అవసరమైన వస్తువు కొనా­లంటే మరో అవసరాన్ని వాయిదా వేసు­కోవాలి.. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధి­­కారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్య­తలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ‘వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా’ పథకాలను మహిళా లబ్ధిదారులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.

ప్రభుత్వం ‘చేయూత’గా ఇస్తున్న రూ.18,750కు తోడు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహి­స్తున్నారు. వయసు పైబడిందని, కుంటుంబానికి భారంగా మారామని కుంగిపోతున్న మహిళలు సైతం ఇప్పుడు సంపాదన మార్గంలో పయనిస్తు­న్నారు. దాంతో సగటున ఒక్కో మహిళ నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పైగా సంపాదిస్తోంది.

పెద్ద చదువులు లేకపోయినా తోచిన చిరు వ్యాపారం చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పుడా మహిళల కళ్లల్లో కుటుంబానికి అండగా నిలబడగలిగామన్న సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్‌ విశాఖపట్నంలో చేయూత, ఆసరా లబ్ధిదా­రులు 2,83,440 మంది ఉంటే, వారిలో 90,491 మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో స్వయం ఉపాధి మార్గాల ద్వారా కుటుంబానికి అండగా ఉన్నారు.
 

ప్రభుత్వ ప్రోత్సాహంతో మారిన రాతలు
రాష్ట్ర ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తోంది. మున్సి­పాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ తరహా ఆర్థిక సాయం పొందిన మహిళలు 5,32,393 మంది ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.998,23,68,750 చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల సాయం అందించింది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చెల్లించాల్సిన బ్యాంకు అప్పును ప్రభుత్వమే చెల్లి­స్తుందని ఇచ్చిన హామీ మేరకు ఆ సాయాన్ని ‘ఆసరా’ రూపంలో చెల్లిస్తున్నారు.

ఇలా పట్టణ ప్రాం­తాల్లోని 1,54,921 స్వయం సహాయక సంఘాల్లో 14,75,883 మందికి గత మూడేళ్లల్లో రూ.3,300 కోట్లు చెల్లించారు. పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 20,08,276 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారులు స్థానిక యూఎల్బీలో స్వయం ఉపాధి మార్గాలపై సదస్సులు, సమావేశాలు నిర్వ­హించారు. ఆసక్తి గల వారికి వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణని­చ్చారు.

అసర­మైన వారికి మెప్మా రుణాలు ఇప్పించింది. ప్రభు­త్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 2,56,959 మంది, ఆసరా లబ్ధిదారుల్లో 5,19,400 మంది మొత్తం 7,76,359 మంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి మా­ర్గాలు ఎంచుకున్నారు. సమర్థవంతమైన సీఎం జగన్‌ పాలన వల్లే అక్కచెల్లెమ్మలు ఈ విజ­యం సా­ధించారని, ఆర్థికంగా నిలదొక్కుకుని తల రాతలు మార్చుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగనన్న చలవతో నిలదొక్కుకున్నా
నా భర్త చనిపోయాడు. ఉన్న ఒక్క బిడ్డను పోషించుకునేందుకు నాకు వచ్చిన టైలరింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నాను. ఆర్టర్లు లేక ఇబ్బంది పడుతున్న సమ­యంలో ‘చేయూత’ వరంగా మారింది. వచ్చిన రూ.­18,750కు తోడు మెప్మా రుణం తీసుకుని ఎన్‌­ఏడీ సెంటర్‌లో పళ్ల దుకాణం ఏర్పాటు చేసు­కున్నా. ఈ వ్యాపారంలో రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. నా కాళ్లమీద బతకగల­నన్న భరోసా కలిగింది. వ్యాపారాన్ని ఇంకా విస్తరి­స్తాననే నమ్మకం ఉంది. ఇదంతా జగనన్న చలవే.
– మళ్ల అన్నపూర్ణ, ఎన్‌ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం

ఆత్మవిశ్వాసం పెరిగింది
గతంలో నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు సత్తువ తగ్గి­పోయింది. పనులకు పిలవడం లేదు. కు­టు­­ంబానికి భారం అవు­తా­ననుకున్నాను. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. చేయూత డబ్బులతో రోడ్డు పక్కన కూరగాయల దుకాణం ఏర్పాటు చేసు­కున్నా. ఇప్పుడు నేను రోజూ రూ.400 సంపా­ది­స్తున్నా. ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నా. ఇదంతా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సా­హమే.
– కరణం లక్ష్మి, ఎన్‌ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)