Breaking News

నారా సురాపానంపై మహిళలు కన్నెర్ర

Published on Sat, 09/13/2025 - 04:49

చీమకుర్తి రూరల్‌: కూటమి ప్రభుత్వంలో మద్యం బెల్ట్‌ షాపుల వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బెల్ట్‌ షాపులపై దాడి చేసి మద్యం సీసాలు పగులగొట్టారు. మూడు వేల జనాభా ఉన్న తమ గ్రామంలో ఏకంగా 8 బెల్ట్‌ షాపులు పెట్టారని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా స్పందన లేకపోవడంతో శుక్రవారం వారే ఏకంగా రంగంలోకి దిగారు. 

గ్రామస్తుల కథనం మేరకు.. మంచికలపాడు గ్రామంలో అధికార టీడీపీకి చెందిన వారు 8 బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ కుటుంబాలు గుల్లవుతున్నాయని మహిళలు కొద్ది నెలలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గ్రామంలోంచి బెల్టుషాపులు తీసేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీలకు అతీతంగా గ్రామ సభ నిర్వహించారు. 

పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామంలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని గ్రామ నాయకులు, పంచాయతీ అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ఎక్సైజ్‌ అధికారులకు పట్టిస్తామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్‌ పొన్నపల్లి సుబ్బారావు మాట్లాడుతూ తమ గ్రామంలో 8 మద్యం బెల్టుషాపులు పెట్టారని, వాటిని తొలగించాలని కోరుతూ స్పందనలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. 

స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌కు కూడా ఈ సమస్యపై అర్జీ ఇచ్చామని చెప్పారు. గ్రామసభ అనంతరం.. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు బెల్టుషాపుల వద్దకు వెళ్లి అక్కడ మద్యం సీసాలను పగులగొట్టి, మద్యాన్ని పారబోశారు. మద్యం దుకాణం చుట్టూ ఉన్న గ్రీన్‌ మ్యాట్లను ధ్వంసం చేశారు. నిరసనలోమహిళలతో పాటు సర్పంచ్‌ పెరికల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచులు చలువాది శేషమ్మ, శ్రీను, అచ్చాల ఏసోబుతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)