Breaking News

వైఎస్సార్‌సీపీ హయాంలోనే ‘మహోన్నత’ మహిళ!

Published on Tue, 11/12/2024 - 04:29

సాక్షి, అమరావతి: రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్‌ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమ­వా­రం ప్రవేశపెట్టిన జెండర్‌ బడ్జెట్‌ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాల­ను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామా­జి­క, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–­25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్‌­లో కొంతభాగాన్ని జెండర్‌ బడ్జెట్‌ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్‌ బడ్జెట్‌ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.

విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేషన్‌ పను­ల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముంద­డుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీ­య స్థాయిలో నీతి ఆయోగ్‌ రూపొందించిన ర్యాంకింగ్‌­లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహి­ళా పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్‌స్టాఫ్‌ సెంటర్లు, హెల్ప్‌డెస్‌్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్‌ బడ్జెట్‌లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.

జెండర్‌ బడ్జెట్‌ కేటాయింపులు ఇలా
ప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్‌ బడ్జెట్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం కంటే కూటమి ప్రభు­త్వం ప్రధాన కేటాయి­ంపులు తగ్గించింది. 
⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్‌లో 100శాతం కేటాయింపులు (పార్ట్‌–ఏ ప్రోగ్రామ్‌)లో రూ.20,935.56­కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్‌–బి ప్రోగామ్‌)లో రూ.58,355.44­కోట్లు కేటాయించి­ంది. మొత్తం రూ.79,291­కోట్లు మాత్రమే కేటాయించింది. 

చిన్నారుల సంక్షేమానికి ఇలా.. 
⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటా­యించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్‌–ఎ)లో రూ.13,793.51­కోట్లు, పార్ట్‌–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది.  

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు