Breaking News

అయ్యా.. కాపాడండయ్యా..!

Published on Sat, 11/08/2025 - 10:03

అయ్యా.. బస్సు ఢీకొంది..  భార్యకు తీవ్ర గాయాలయ్యాయి... కాపాడండయ్యా.. కాసిన్ని నీళ్లు తేండయ్యా.. శ్రీలత లే... ఒక్కసారి కళ్లు తెరచి చూడు.. అంటూ  భార్యను ఒడిలో ఉంచి భర్త చేసిన ఆర్తనాదాలు అక్కడివారిని కన్నీరుపెట్టించాయి. కళ్లముందే భార్య చనిపోవడంతో భర్త చేసిన రోదనతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది.  

విజయనగరం జిల్లా: గరివిడి మండలం గదబవలస పంచాయ తీ పరిధిలోని ఐతాంవలస సమీపంలోని రోడ్డు మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరగంజి శ్రీలత(46) అనే మహిళ దుర్మరణం చెందగా, భర్త సంగంనాయుడికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... తెర్లాం మండలం పెరుమాళి గ్రామానికి చెందిన సంగంనాయుడు, శ్రీలత దంపతులు చీపురుపల్లి మండలంలో ఉన్న మానసాదేవి నాగశక్తి అమ్మవారిని దర్శించుకునేందుకు స్కూటీపై బయలు దేరారు. పెరుమాళి నుంచి చీపురుపల్లి వైపు వెళ్తుండగా ఐతాంవలస గ్రామానికి సమీపంలో ఉన్న మలుపు వద్దకు వచ్చేసరికి.. చీపురుపల్లి వైపు నుంచి ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ వెనుకవైపున కూర్చున్న శ్రీలత వెనుకకు పడిపోగా బస్సు టైరు ఆమె తలమీదుగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడవగా భర్తకు స్వల్పగాయాలయ్యాయి.  

ఆనందంగా ఉన్నామన్న సమయంలో...  
వీరిది మధ్యతరగతి కుటుండం. సంగంనాయు డు రాజాం జ్యూట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు ఆడపల్లలు. పెద్దమ్మాయి శ్రావణి శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, చిన్నమ్మాయి సంధ్య నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది. కష్టపడి చదివించి న ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారు.. ఆనందంగా ఉందామన్న సమయంలో విధి కన్నెర్రచేసింది. భర్తకు, పిల్లలకు పెద్దదిక్కును బస్సు ప్రమాదం రూపంలో మృత్యుఒడిలోకి చేర్చింది. శ్రీలత మరణంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)