Breaking News

భర్త వేధింపులు.. నువ్వు కన్యవేనా?

Published on Thu, 01/22/2026 - 07:24

కడప అర్బన్‌ : కడప చిన్న చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రకాష్‌ నగర్‌లో తన భర్త మద్దూరి దినేష్‌ నివసిస్తున్న ఇంటి ఎదుట భార్య శ్రీలక్ష్మి బుధవారం న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు, మద్దూరి దినేష్‌కు 2022 జూన్‌ 18న కర్నూల్‌లో వివాహమైందని, తమకు కుమారుడు ఉన్నాడని తెలిపారు.

తన భర్త, కుటుంబ సభ్యులు వివాహ సమయంలో ఇచ్చిన 25 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 5 లక్షల రూపాయలు నగదు, తాను ఉద్యోగం చేసి సంపాదించిన రూ.లక్ష ఇరవై వేలు, తనకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమకు సంబంధించిన వస్తువులను తీసుకునేందుకు వస్తే వారు పలకడం లేదన్నారు. న్యాయం కోసం ఇంటిముందు బైఠాయించాల్సి వచ్చిందని తెలిపారు. తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కర్నూలులోని తమ పుట్టింటిలో వదిలేసి వెళ్లిపోయాడని, తర్వాత కుమారుడు జన్మించాడు, అప్పటినుంచి పట్టించుకోలేదని తెలిపారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళ ఆరోపించారు. 

వివాహమైనప్పటి నుంచి తనను శారీరకంగా మానసికంగా బాధపెట్టారని తెలియజేశారు. ఆమె తల్లి, రెండున్నర సంవత్సరాల కుమారుడు, టీడీపీకి చెందిన నాయకురాలు, బంధువులు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ సంఘటనపై చిన్న చౌక్‌ పోలీసులు మాట్లాడుతూ ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, కోర్టులో కేసు నడుస్తుందని తెలియజేశారు. ఆందోళన విషయమై మహిళను పిలిపించి మాట్లాడామని తెలిపారు.   

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)